ఒక్కరోజే కాదు ప్రతిరోజూ మాతృ దినోత్సవం నిర్వహించుకోవాల్సిందే. ఆమె షరతులు లేని ప్రేమ… బిడ్డలకు ఎన్నో జీవిత పాఠాలను నేర్పుతుంది. ఒక బిడ్డకు అమ్మే తొలి ఉపాధ్యాయురాలు. ఓదార్పును మార్గదర్శకత్వాన్ని విలువలను నేర్పేది అమ్మే. అలాంటి అమ్మకు అందంగా తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పండి. కేవలం అమ్మకే కాదు, అమ్మ స్థానంలో ఉండి మీ ఉన్నతికి కృషి చేసిన ప్రతి స్త్రీకి శుభాకాంక్షలు చెప్పవలసిన అవసరం ఉంది. ఇక్కడ మేము కొన్ని కోట్స్‌ను తెలుగులో అందించాము. వీటిని ఫోన్లో మెసేజ్‌ల రూపంలో, వాట్సాప్ స్టేటస్‌లుగా, ఫేస్‌బుక్‌లో సందేశాలుగా పెట్టి మీ అమ్మ ప్రేమను చాటుకోండి.
అమ్మ పిల్లల కోసం ఎంతో చేస్తుంది. నవమాసాలు మోసి, ప్రాణాలు పోయేంత నొప్పులను భరించి, ప్రాణం పోసిన తన ముద్దుల పట్టి కోసం ఆ తల్లి జీవితాంతం చేసే త్యాగాలు అన్ని ఇన్ని కాదు. బిడ్డ పుట్టినప్పటినుంచి పెరిగి పెద్దవారై, వాళ్ల పిల్లలు పెద్దవాళ్లు అయినా కూడా తల్లికి ఆ బిడ్డ ఇంకా చిన్నపిల్లాడిలా కనిపిస్తాడు. కన్నబిడ్డలకు చిన్న కష్టం వచ్చిందంటే విలవిలలాడి పోయేది అమ్మ మాత్రమే.
ఇంట్లో అందరికీ భోజనం వండడం, ఇల్లు శుభ్రం చేయడం, ఒక్కోసారి అందరి మురికి బట్టలు ఉతకడం వంటి పనులన్నీ చేసేది అమ్మ. కానీ మదర్స్ డే నాడు ఈ పనులన్నింటి నుంచి తల్లికి విశ్రాంతి ఇచ్చి వాటిని భర్త, పిల్లలు కలిసి చేసి తల్లి అంటే ఇంటి మహరాణి అని గుర్తించాలి.
కనీసం ఈ ఒక్కరోజైనా ఇంట్లో కలిసి కూర్చుని కుటుంబ అవసరాల గురించి చర్చించండి. మీరు ఆమె మనస్సును రిలాక్స్ చేయడానికి అమ్మను స్తుతిస్తూ పాటలు పాడటం మరియు పద్యాలు చెప్పడం వంటి కార్యకలాపాలను చేయవచ్చు
Discussion about this post