ప్రపంచ చరిత్రలోనే ముట్ట మొదటి సారి 500 బిలియన్ డాలర్లతో 26,500 కిమీ చదరపు విస్తీర్ణం తో 200 మీటర్ల వెడల్పుతో ఇరు వైపులా అద్దాలతో నిర్మించిన 170 కిలోమీటర్ల పొడవు సూటి రహదారి, కృత్తిమ చంద్రుడు, ఫ్లైయింగ్ టాక్సీలు,రోబోటిక్ పని మనుషులు, కర్బన రహిత భవనాలు ఇంకా ఎన్నో మరెన్నో ఊహకు అందని చిత్ర విచిత్రాలు.. అదే సౌదీ యువ రాజు నిర్మిస్తున్న మెగా సిటీ… అదే ప్రిన్స్ మహమ్మద్ బిన్ సులేమాన్ నిర్మిస్తున్న నియూమ్ సిటీ .. యువ రాజు కలల నగరం. ఈ నియోమ్ ప్రాజెక్టును సౌదీ అరేబియా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో నియూమ్ సిటీ పూర్తి చేయాలనే పట్టుదలతో ఉంది.ఈ డ్రీమ్ ప్రాజెక్టుకు ఎవరైనా అడ్డొస్తే చాలు.. చంపేయాలని ఆదేశాలు జారీచేసింది.
ఈ నగరం నిర్మించడానికి కారణాలు చాలా చెబుతున్నారు .. ప్రపంచం అడ్వాన్స్‌గా మారుతుంది. అన్ని విభాగాల్లో వేగంగా డెవలప్ అవుతోంది. టెక్నాలజీ విషయంలో చెప్పక్కర్లేదు. ఇప్పుడు వాడుతోన్న పెట్రో ఉత్పత్తులకు భవిష్యత్‌లో డిమాండ్ తగ్గొచ్చు. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చేశాయ్. సౌదీ అరేబియాలో పెట్రో నిల్వలు కూడా తగ్గిపోతున్నాయి. గ్రీన్ ఎనర్జీపై సౌదీ అరేబియా దృష్టిసారించింది. సౌదీ అరేబియాను గ్లోబల్ హబ్, పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని అనుకుంది. ఆ క్రమంలో ఆవిర్భవించిందే నియూమ్ స్మార్ట్ సిటీ. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.అందుకే అడ్డొచ్చిన వారిని నిర్దాక్షిణ్యంగా లేపేస్తున్నారు.
ఒక ఇంటర్నేషనల్ మీడియా సంస్థతో మాట్లాడిన ఎనేజి సౌదీ యువ రాజు మహమ్మద్ బిన్ సులేమాన్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. కేవలం తన స్వార్థం కోసం దేశ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్టు, తనకు అడ్డువచ్చిన ప్రతి వారికి మరణ శిక్ష వేయడమో లేక జైళ్లలో బంధిస్తున్నారని తెలిపారు. తనను కూడా డబ్బుతో కొనడానికి ప్రయత్నించారని కోట్ల రూపాయల ఎర చూపి తనను లొంగ దీస్కోవడానికి ప్రయత్నం చేశారని, ఇంతకు ముందు జమాల్ ఖశోగి అనే జర్నలిస్ట్ ను టూర్కియా లోని సౌదీ ఎంబస్సి లో దారుణంగా హత్య చేయించిన సౌదీ యువ రాజు తనను కూడా హత్య చేయించే ప్రయత్నంలో ఉన్నాడని తెలిపారు. నాలుగేళ్ల క్రితం జరిగిన దారుణాల గురించి ఓ అధికారి నోరు మెదపడంతో ప్రపంచానికి తెలిసింది.
మొత్తం మీద చూస్తే సౌదీ యువరాజు దాష్టీకాలకు మరెంతమంది బలి కావాల్సిఉంటుందో ?ఈ నయా నాగరిక సమాజంలో రాజుల నరమేధానికి .. రక్తదాహానికి అడ్డుకట్టు వేసేదెవరు ? ? మానవ హక్కుల సంస్థలు ఏం చేస్తున్నాయి ?
Discussion about this post