అపహరణ, బెదిరింపులు, లైంగిక వేధింపుల కేసులో జెడీఎస్ శాసన సభ్యుడు HD రేవణ్ణకు బెంగళూరులోని రెండు కోర్టులు బెయిలు మంజూరు చేశాయి. ఈ కేసుల్లో నిందితుడు,.. HD రేవణ్ణ కుమారుడు, హస్సన్ ఎంపీ ప్రజ్వల్ 3 వేల అత్యాచార కేసులను ఎదుర్కొంటున్నారు. కర్ణాటకలో ఏప్రిల్ 26న మొదటి విడత పోలింగ్ జరగనుండగా.. రెండు రోజుల ముందే సోషల్ మీడియాలో ఈ వీడియోలు షేర్ అయ్యాయి. వెంటనే ప్రజ్వల్ జర్మనీకి చెక్కేశాడు. ప్రజ్వల్ ను అదుపులోకి తీసుకుంటేనే బాధితులు సురక్షితంగా ఉండగలరని, అంతేకాకుండా సాక్ష్యాలను తారుమారు చేయకుండా ఉంటారని బాధితులు ఆవేదన చెందుతున్నారు.
హస్సన్ ఎంపీ, జేడీఎస్ యువనేత ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దోపిడీ వ్యవహారం కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలు రేపింది. మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడకు స్వయానా మనవడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అన్న కుమారుడైన ప్రజ్వల్.. యువతలను ప్రలోభాలకు గురిచేసి, తన లైంగిక వాంఛలను తీర్చుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. అమ్మాయిలకు తెలియకుండా వీడియోలు తీసి, వాటి ఆధారంగా వారిని బెదిరించి ప్రజ్వల్ రేవణ్ణ లొంగదీసుకుని,వాటిని వీడియోలు చేశారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఏకంగా మూడు వేల వీడియోలు ఉంటాయని అంటున్నారు. ప్రజ్వల్, ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆందోళనకు దిగారు. దీనిపై విచారణకు కర్ణాటక ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్ అతనికి బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసింది.
బెయిల్ పిటిషనర్ రేవణ్ణ కుమారుడు సీరియస్ కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. అయినప్పటికీ సమాజానికి బెడదగా ఉన్నాడని భావిస్తే తప్ప అతనికి బెయిల్ మంజూరు చేయడంలో ఎటువంటి వివక్షత లేదని స్పెషల్ ఎమ్మెల్యే / ఎంపీ ప్రత్యేక కోర్టు మే 13న వెల్లడించింది. లీక్ అయిన వీడియోల్లో రేవణ్ణ ఒక అమ్మాయిని రేప్ చేస్తున్న దృశ్యం ఉంది. అతనిపై ఆరోపణలతో ఫిర్యాదు చేయడమే కాని, నిందితుడైన రావణ్ణ పై మరిన్ని సాక్ష్యాదారాలు అందలేదని కోర్టు తెలిపింది. ఈ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ, ఎంపీ ప్రజ్వల్‌పై లైంగిక దౌర్జన్యం కేసు నమోదు చేసిన 47 ఏళ్ల బాధిత మహిళ వారికి బంధువే కావడం గమనార్హం. ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణకు ఆమె స్వయానా మేనత్త కుమార్తె. రేవణ్ణ మంత్రిగా ఉన్నప్పుడు ఆమెకు పాల కేంద్రంలో పని ఇప్పించారు. అనంతరం బీసీఎం హాస్టల్‌లో వంట మనిషిగా అవకాశం కల్పించారు. 2015లో ఆమెను వారి ఇంట్లో పనికి చేర్పించారు. రేవణ్ణ నివాసంలో ఆరుగురు మహిళలు, యువతులు పని చేస్తున్నారు. ఇంటిలో చేరిన నాలుగు నెలల నుంచి తనపై లైంగిక దోపిడీకి పాల్పడుతూ వచ్చారని, భవానీ రేవణ్ణ ఇంట్లో లేని సమయంలోనే తనపై లైంగిక దౌర్జన్యానికి దిగేవారని బాధితురాలు ఆరోపిస్తున్నారు.
సతీష్ బాబన్న అనే వ్యక్తి తన తల్లిని రేవణ్ణ కలవాలన్నారని చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్లాడని బాధితురాలి కుమారుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. నెంబర్ 1 నిందితుడైన రేవణ్ణపై సెక్షన్ 376 ఐపీసీ లో కేసు నమోదు చేయలేదని, ఆయన కుమారుడు ప్రజ్వల్ పైనే నమోదైందని కోర్టు తెలిపింది. అయితే రేవణ్ణ పై కేసును బెనఫిట్ ఆఫ్ డౌంట్ అంటే సందేహాత్మకంగా ఉందన్న కారణంతో ఆయనకు బెయిల్ లభించింది. ప్రజ్వల్ కు వ్యతిరేకంగా కేసు మారితే రావణ్ణ పై చట్టపరమైన వ్యూహం మారుతుందని, ఈ కేసులో అధికారుల భాగస్వామ్యం పై కూడా అవగాహన వస్తుందన్నారు. రేవణ్ణ , అతని కుమారుడి మధ్య ఐపిసి సెక్షన్ 120 బి కింద కుట్రకు సంబంధించిన ఉమ్మడి అభియోగం లేనందున, వారి ఇద్దరి కేసులను విడివిడిగా పరిష్కరించాల్సి ఉంటుందని కోర్టు వర్గాలు తెలిపాయి. రావణ్ణపై ఉన్న లైంగిక వేధింపుల కేసు లో బెయిల్ కు ప్రయత్నిస్తున్నప్పుడు మాత్రమే ఆయనపై అత్యాచార ఆరోపణలను పొందుపరిచారన్నారు. అంతకు ముందు కేవలం లైంగిక హింస కేసును మాత్రమే 354 సెక్షన్ ప్రకారం నమోదు చేశారన్నారు. దీంతో ఆకేసులో బెయిల్ పొందే అవకాశం ఉందని కోర్టు తెలిపింది.
రెండు బెయిల్ కేసుల్లోనూ, రేవణ్ణ సాక్షులను బెదిరించగలడని ప్రాసిక్యూషన్ లాయర్లు సుదీర్ఘంగా వాదించారు. అయినప్పటికీ ప్రయోజం లేకుండా పోయింది. అంతేకాకుండా 2019లో హసన్ ఎంపీగా ప్రజ్వల్ ఎన్నికలో రేవణ్ణ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయన్నారు. ఎన్నికల అఫిడవిట్ అంతా తప్పుల తడకగా ఉందన్న కారణంగా గతేడాది సెప్టెంబర్ లో కర్ణాటక హైకోర్టు ప్రజ్వల్ ను అనర్హుడిగా ప్రకటించింది. అయితే దీనిపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో ఎంపీగా కొనసాగుతున్నాడు. రేవణ్ణ దౌత్య పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని కర్ణాటకలో అధికారంలో ఉన్న సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ.. ట్విటర్ వేదికగా కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో రెండు పేజీల సుదీర్ఘ లేఖలను విడుదల చేశారు. ప్రజ్వల్ రేవణ్ణకు తాత వార్నింగ్ పేరుతో విడుదల చేసిన ఆ లేఖలో.. ప్రజ్వల్ రేవణ్ణ ఎక్కడ ఉన్నా సరే.. తక్షణమే వచ్చి.. పోలీసుల ముందు లొంగిపోవాలని తీవ్ర హెచ్చరికలు చేశారు. తన సహనాన్ని పరీక్షించొద్దని.. లొంగిపోకపోతే తన ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Discussion about this post