టోర్నీ ఆద్యంతం విజయాలతో హోరెత్తించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిమెట్టుపై బోల్తా పడింది. ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమిపాలై కప్‌ను చేజార్చుకుంది.కానీ ఈ సీజన్లో SRH చేసిన పోరాటం అద్వితీయం. క్రికెట్ ప్రపంచం ఉలిక్కిపడేలా, ప్రత్యర్థులు సలామ్ కొట్టేలా విధ్వంసం నెలకొల్పారు. రికార్డులను బ్రేక్ చేస్తూ చరిత్రను తిరగరాస్తూ పోరాడారు.
ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగన నిలిచింది. హైదరాబాద్ జట్టుతో మ్యాచ్ అంటే ఏకపక్షమే అని, ప్రత్యర్థికి సులువుగా రెండు పాయింట్లు వస్తాయనే రీతిలో గత సీజన్లో దారుణమైన విమర్శలు వచ్చాయి.ఈ విమర్శలతో రగిలిపోయిన సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ జట్టును సరికొత్తగా నిర్మించాలనుకుంది. విదేశీ ఆటగాళ్ల కోసం రూ.కోట్లు కుమ్మరించింది. కమిన్స్ కోసం ఏకంగా రూ.20.45 కోట్లు ఖర్చు పెట్టింది.అయితే వేలంలో SRH తీసుకున్న ఈ నిర్ణయాలను నెటిజన్లతో సహా మాజీ క్రికెటర్లు వెక్కిరించారు. పేలవమైన వ్యూహాలన్నారు. కానీ కట్ చేస్తే.. 2024లో సన్‌రైజర్స్ ప్రత్యర్థి వెన్నులో వణుకు పుట్టించింది.కనీసం 120 స్కోరు అయినా సాధిస్తారా అని హేళన చేసిన వాళ్లకు బ్యాటుతోనే సమాధానమిచ్చింది. పవర్‌ప్లేలోనే ఏకంగా 125 స్కోరు సాధించి రికార్డులు సృష్టించింది.ఇక 11 ఏళ్లుగా ఎవరూ తాకని RCB అత్యధిక స్కోరు రికార్డును తునాతునకలు చేసింది. ఏకంగా మూడు సార్లు 250 కి పైగాస్కోరు సాధించింది. టీ20 క్రికెట్లో సరికొత్త ట్రెండ్ సృష్టించింది.
పొట్టిఫార్మాట్లో బ్యాటింగ్ ఎలా చేయాలో క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసింది. ఇక 15, 16 బంతుల్లో అర్ధశతకాలు..39 బంతుల్లో శతకం మన బ్యాటర్ల సత్తాకు మరో నిదర్శనం.కానీ ఫైనల్లో తడబడి కప్‌ను చేజార్చుకుంది. ఒక్క రోజు పేలవమైన ఆటతో ట్రోఫీని కోల్పోయింది. అయితే ఈ ఓటమి సన్‌రైజర్స్ కీర్తిని ఇసుకురేణువంత కూడా తగ్గించదు అని ఐపీఎల్ అభిమానులు సలాం చేస్తున్నారు.
Discussion about this post