వైయస్ షర్మిల చంద్రబాబు వద్ద సూట్ కేసులు తీసుకుని సొంత అన్నపైన విమర్శలు చేస్తుందని కోవూరు ఎమ్మెల్యే అభ్యర్ధి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపించారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం పురందర పురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. షర్మిల చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ అయ్యిందని, రాజశేఖర్ రెడ్డి కుటుంబ పరువునే తీసేసిందని అన్నారు. మధ్యతరగతి పేద కుటుంబాలకు రాజకీయాలలో అవకాశం కల్పించకూడడా అని వేమిరెడ్డి దంపతులను ప్రశ్నించారు. ప్రతిపక్షాలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలను మాత్రమే నమ్ముకున్నారని అన్నారు. ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
Discussion about this post