తెలుగు రాష్ట్రాల్లోనే ఏకైక పెద్ద మార్కెట్ గా ఉన్న నిజామాబాద్ యార్డుకు ఆమ్చూర్ రాక మొదలైంది. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి సుమారు 170 బస్తాల పంట వచ్చింది. ప్రస్తుతం కనిష్ఠ ధర క్వింటాలుకు రూ.17,200 కాగా, గరిష్ఠంగా రూ.23,700 వస్తుంది. గతేడాది గరిష్ఠ ధర రూ. పాతిక వేల వరకు వచ్చింది. ఈ ఏడాది మామిడి పంట భారీగా కాసినప్పటికీ ఇటీవల వచ్చిన భారీ ఈదురుగాలులకు, వడగండ్లకు కాయ ముందే రాలిపోవడంతో దాన్ని ఆమ్చూర్గా మార్చేసి రైతులు మార్కెట్ కు తెచ్చారు. అయితే ధర సరిగ్గా రావడంలేదని ఆందోళన చెందుతున్నారు.
Discussion about this post