నంబర్‌ప్లేట్ అంటే తెలియని వారు ఉండరు… కానీ అందులో కొన్ని రకాల ఉంటాయని మాత్రం కొద్ది మందికే తెలుసు… ఇంతకి నంబర్ ప్లేట్ ఎన్ని రకాలు. వాటిని ఎందుకలా కేటాయిస్తారు. దాని వెనుక గల కారణాలేంటి అనే విషయాలు తెలుసుకుందా చలో..
ప్రస్తుత జనరేషన్లో వాహనం లేనిదే బయటకు వెళ్లలేని పరిస్థితి… ప్రతి ఇంట్లో ఓ వాహనం తప్పకుండా ఉంటుంది. అది టూ విలర్ లేదా ఫోర్ వీలర్ వెహికిల్స్. ఇక వాటిని ఆర్టీఐ అధికారులు వివిధ రకాల నంబర్లు కేటాయిస్తారు. ఫ్యాన్సీ నంబర్ల కోసం సామాన్యుల నుంచి ప్రముఖల వరకూ పోటీ ఉంటుంది. అయితే మనం రోజు చూసే వాహనాల వెనుక ముందు వివిధ రకాల నంబర్ ప్లేట్లు కనిపిస్తుంటాయి. ఒకదానికి తెలుపు, ఒకదానికి పసుపు.. మరోదానికి ఆకుపచ్చ.. అరుదుగా నలుపు, ఎరుపు, నీలం వర్ణపు ఫలకలు కనిపిస్తుంటాయి. ఇలా ప్రత్యేక రంగులో నంబర్ ప్లేటు ఏర్పాటు వెనుక కారణాలు మాత్రం చాలామందికి తెలియవు. ఏ రంగు నంబర్ ప్లేటు దేనికి సంకేతం? ఎలాంటి సేవలకు దీనిని వినియోగిస్తారు అనేది చాలా కొద్ది మందికే తెలుస్తుంది.
చాలా మందికి తెలియక నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలను కిరాయికిచ్చి బుక్కవుతుంటారు. కిరాయికిచ్చి ఆర్టీఏ అధికారులకు అడ్డంగా దొరుకుతారు. వాహన రిజిస్ట్రేషన్ సమయంలోనే అవి అందించబోయే సేవలకు చిహ్నంగా ఆయా రంగుల్లో నంబర్ప్లేట్లను కేటాయిస్తారు. మన దేశంలో ఏడు రకాల నంబర్ప్లేట్లు ఉంటాయి. ఒక్కో కేటగిరీకి ఒక్కో నంబర్ ప్లేట్‌ను వినియోగిస్తారు.
నాన్‌ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు తెలుపు రంగు ప్లేట్లను కేటాయించారు. వైట్ ప్లేట్‌మీద బ్లాక్ నంబర్ ఉంటాయి. ఇది సొంత అవసరాలకు వాడుకునే వారికి కేటాయిస్తారు. ఈ నంబర్ ప్లేట్ ఉన్న వాహనాలను రెంట్‌కు ఇస్తే మాత్రం సమస్య ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి వాటిని కిరాయికి ఇవ్వడం కుదరదు.. అలా చేస్తూ ఆర్టీఏకి చిక్కితే ఫెనాల్టీతో పాటు సీజ్ చేస్తారు. సో సొంత వాహనాలు అంటే వైట్ అండ్ బ్లాక్ నంబర్ ప్లేట్ ఉన్న వెహికిల్స్‌ను అద్దెకు అస్సలు ఇవ్వొద్దు. ఇక ఇంకొన్ని వాహనాలకు పసుపు రంగు కేటాయిస్తారు… ఇవి ట్రాన్స్‌పోర్టుకు సంబంధించినవి.. ఎల్లో కలర్ ప్లేట్‌పై బ్లాక్ కలర్ ఉంటే అది ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన బండి అని గుర్తించాలి. ఇలాంటి తరహా వాహనాలను వ్యాపారం చేయడానికి, సరుకులు, ఇతర వస్తువలు రవాణా చేయడానికి ఉపయోగిస్తారు. పసుపు-నల్లకలర్ ప్లేట్ కలిగిన వాహనాలు కమర్షియల్ అవసరాలకు వాడుతుంటారు.. మొత్తం మీద చెప్పాలంటే గూడ్స్ సర్వీస్‌కు అనుమతి ఉన్న వాహనం అని అర్ధం.
Discussion about this post