ఒలంపిక్ జ్యోతితో ప్యారీస్ సమ్మర్ గేమ్స్ కు శుభారంభం పలకనున్నారు. ఒలంపిక్ టార్చ్ ఫ్రాన్స్ లోని మార్సెయిల్స్ కు చేరుకుంది. గ్రీకు లోని ఒలంపిక్ జన్మస్థలమైన ఒలింపియాలో జ్యోతిని ప్రదర్శించారు. అక్కడి నుంచి ఓడ లో మార్సెయిల్స్ కు పంపారు. క్రీడా జ్యోతిని ఫ్రాన్స్ అంతటా క్రీడాకారులు ప్రదర్శనగా తీసుకు వెళతారు. జూలై 26న ప్యారీస్ లో సమ్మర్ స్పోర్ట్స్ ప్రారంభిస్తారు. ఒలంపిక్స్, క్రీడాజ్యోతి అవినాభావ సంబంధంపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
చరిత్రలోకి వెళితే ఒలంపిక్స్ కు 3 వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఒలంపిక్ క్రీడలు ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరుగుతాయి. పోటీకోసమే కాకుండా శాంతికోసం ఈ క్రీడలను నిర్వహిస్తారు. క్రీస్తు పూర్వం 9 వ శతాబ్దం నుంచే ఒలంపిక్ సంధి ఒప్పందం జరిగింది. దీనినే గ్రీకులో ఎకెచెరియా అంటారు. ఎలిస్ రాజులు, పీసాకు చెందిన క్లియోస్థెనెస్, స్పార్టాకు చెందిన లైకుర్గస్ రాజులు ఒలంపిక్ క్రీడలలో పాల్గొనే క్రీడాకారులకు సురక్షితమైన మార్గాన్ని అనుసరించేందుకు ఒప్పందం పై సంతకం చేశారు. నిరంతరం క్రీడల్లో ఒకరిపై ఒకరు పోటీ పడినప్పటికీ అంతిమ లక్ష్యం మాత్రం క్రీడా స్ఫూర్తి, సుహృద్బావ వాతావరణమే అని వేల ఏళ్ల కిందటే రాజులు ప్రకటించడాన్ని మనం గుర్తుంచుకోవాలి.
అయితే, క్రీ.శ. 393లో, క్రైస్తవ చక్రవర్తి థియోడోసియస్ I క్రైస్తవేతర ఆరాధనల వేడుకలను నిషేధించాడు, ఇందులో ఒలంపిక్ క్రీడలు కూడా ఉన్నాయి. ఒలంపిక్స్ వేల సంవత్సరాల ముందుగానే ప్రారంభం అయినప్పటికీ 776 BC నుంచి వీటిని నమోదు చేశారు. మధ్యలో క్రైస్తవ చక్రవర్తి థియోడోసియస్ I కారణంగా కొన్నేళ్లుగా ఒలంపిక్ క్రీడలను ప్రజలు మర్చిపోయినప్పటికీ 1896 నుంచి ఒలంపిక్స్ ను పునరుద్దరించారు. పూర్వం గ్రీకులో క్రీడా జ్యోతితో పరుగెత్తే సంప్రదాయాన్ని 1928లో ఆమస్టర్ డాం లో మొదటి సారి పాటించారు. ఇందుకోసం ఒలంపిక్ జ్యోతిని ఏథెన్స్ నుంచి బెర్లిన్ కు తరలించారు. ఏడు దేశాల నుంచి 3 వేల మంది క్రీడాకారులు క్రీడా జ్యోతితో ప్రజల్లోనూ, ఔత్సాహిక క్రీడాకారుల్లోనూ స్ఫూర్తిని నింపారు. అయితే బెర్లిన్ గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీ సెక్రటరీ జనరల్ కార్ల్ డైమ్ ఈ సంప్రదాయాన్ని పటిష్టం చేశారు. రిలే టార్చ్ ను కొనసాగించడం ఆ తర్వాతి కాలంలో వచ్చింది.
Discussion about this post