అంతర్జాతీయ వ్యవహారాలలో భారత్ కు భాగస్వామ్యం కల్పించడమే అని ప్రధాని మోడీ అన్నారు. G-7, ఉక్రెయిన్ శాంతి చర్చల్లో భారత్ పాలుపంచుకుంటుందని ప్రధాని పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. వచ్చే నెలలో జరగనున్న రెండు కార్యక్రమాలపై ప్రధాని ప్రతిస్పందిస్తూ.. ప్రపంచ శాంతి కోసం అన్ని ముఖ్య శిఖరాగ్ర సమావేశాల్లో భారత్ పాల్గొంటుందన్నారు.
మానవాభివృద్ది కేంద్రంగా జరిగే అన్ని కార్యక్రమాల్లో భారత్ తన వాణిని వినిపిస్తుందన్నారు. రెండు సమావేశాల్లో పాల్గొంటారా అని అడిగిన ప్రశ్నకు ప్రధాని సమాధానమిస్తూ సమయం, “పాల్గొనే సమయం, సమావేశంలో ప్రస్తావించే అంశం, బట్టి ఉంటుంది” అన్నారు. జూన్ 13 నుంచి 15 వరకు G7 సమావేశాలకు ఇటలీ ఆతిధ్యమిస్తోంది. జూన్ 15,16ల్లో స్విట్జర్లాండ్ లో జరిగే సమావేశంలో ఉక్రెయిన్ శాంతిపై చర్చిస్తారు. భారత సంస్కృతికి అద్దం పడుతూ వసుదైక కుటుంబం ఏర్పడేలా.. ప్రపంచ శాంతి, భద్రత , అభివృద్ధిని ప్రోత్సహించే అన్ని ముఖ్యమైన శిఖరాగ్ర సమావేశాలలో భారతదేశం పాల్గొంటుందని మోడీ చెప్పారు.
Discussion about this post