శక్తివంతమైన సౌర తుఫాను భూమిని ఢీకొట్టింది. దీంతో కమ్యూనికేషన్ వ్యవస్థ, పవర్ గ్రిడ్స్ దెబ్బతిన్నాయి. రెండు దశాబ్దాల్లో ఇదే శక్తివంతమైందని సౌరతుఫానుగా.. ఆకాశంలో తాస్మానియా నుంచి బ్రిటన్ వరకు కనిపించిన శక్తివంతమైన కాంతితో అది ఎంత బలమైన సౌరతుఫానో తెలుస్తోంది. సౌర తుఫానులు ఎందుకు ? ఎలా ఏర్పడతాయో తెలుసుకుందాం..
సూర్యుని వాతావరణ బయటి పొర కరోనా నుంచి సౌరగాలితో అయస్కాంత క్షేత్రాల్లో భారీ పేలుడు జరుగుతుందని… ఆపై అది తీవ్ర సూర్య అయస్కాంత తుఫానుగా మారుతుందని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ , స్పేస్ వెదర్ ప్రిడిక్షన్ సెంటర్ తెలిపింది. దీనినే కరోనల్ మాస్ ఎజెక్షన్ లేదా హల్లోవీన్ స్ట్రోమ్స్ అని కూడా అంటారన్నారు. 2003 అక్టోబర్ లో జరిగిన సౌర తుఫానుతో స్వీడన్, సౌత్ ఆఫ్రికాలో లో విద్యుత్, మౌలిక సదుపాయాలన్నీ దెబ్బతిన్నాయి. అయితే రానున్న రోజుల్లో మరింత విధ్వంసం జరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఉత్తర యూరప్, ఆస్ట్రేలియాలో సోషల్ మీడియాలో దీని ఆరోరా అనగా గ్రహం బయటి నుంచి వచ్చే వెలుగు చిత్రాలను షేర్ చేస్తున్నారు. శాటిలైట్ల ఆపరేటర్లు, ఎయిర్ లైన్స్ , పవర్ గ్రిడ్ల విషయమై ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని లేకుంటే భూ అయస్కాంత క్షేత్రంలో మార్పులు ఉంటాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సూర్యుడిలోని మంటలే కాకుండా సూర్యుడి కిరణాలు కూడా నుంచి భూమికి చేరాలంటే 8 నిముషాల సమయం పడుతుంది. సూర్యుడి ఉపరితలంపై సంభవించిన తుఫాన్ల కారణంగా భూమికి 17 రెట్ల పరిణామంలో సూర్యునిపై నల్లమచ్చ ఏర్పడింది. ఈ మచ్చ మరింత పెద్దదయ్యే అవకాశం ఉందని సైంటిస్టులు ఆందోళన చెందుతున్నారు.
స్పేస్ ఫిజిక్స్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న మాథ్యూ ఓవెన్ చెప్పిన దాని ప్రకారం భూగోళం దక్షిణ, ఉత్తర అక్షాంశాలు సాగిపోయే అవకాశం ఉందని అయితే ఇది సౌర తుఫానులోని శక్తి పై ఆధారపడి ఉంటుందన్నారు. రాత్రిళ్లు బయటకు వెళ్లి చూసినా ఆ మచ్చ కనబడుతుందని, గ్రహణం కళ్లద్దాలతో చూస్తే పగలు కూడా సూర్యుడిపై ఆ మచ్చలను చూడవచ్చన్నారు. అమెరికాలో నార్తరన్ కాలిఫోర్నియా, అలబాల నుంచి స్పష్టంగా చూడవచ్చన్నారు. భౌగోళిక అయస్కాంత తుఫానులోని హెచ్చుతగ్గులు విద్యుత్ లైన్లతో సహా పొడవైన వైర్లలో విద్యుత్ ప్రవాహాలను ప్రేరేపిస్తాయి. ఇవి బ్లాక్ అవుట్లకు దారితీయవచ్చు. పొడవాటి పైప్లైన్లు కూడా విద్యుదీకరించబడతాయి, ఇది ఇంజనీరింగ్ సమస్యలకు దారితీస్తాయి.
అంతరిక్షంలోని శాటిలైట్లు రేడియేషన్ కు గురై అవి భూమికి చేరుకోలేకపోవచ్చు. నాసా తన వ్యోమగాముల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. అందుకోసం రేడియేషన్ వైపుకు కాకుండా మరొక వైపు నుంచి రావాల్సిందిగా వారిని కోరింది. పావురాలు, ఇతర పక్షులు కూడా ఈ అంతరిక్ష పరిస్థితుల ప్రభావానికి లోనవుతాయి. భౌగోళిక అయస్కాంత తుఫానులో పక్షులు బయటకు వెళ్లవని నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ తెలిపింది. ప్లాష్ లైట్లు, బ్యాటరీలు, రేడియోల బ్యాక్ అప్ ల కోసం ప్రత్యామ్నాయాలను ఏర్పాటుచేసుకోవాలన్నారు.
అత్యంత శక్తివంతమైన భౌగోళిక అయస్కాంత తుఫాను 1859 సెప్టెంబరులో రికార్డు అయ్యింది.
Discussion about this post