చైనా- రష్యా సంబంధాలు మరింతగా మెరుగుపరచుకుంటామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్, చైనా అధ్యక్షుడు గ్జి జిన్ పింగ్ లు స్పష్టం చేశారు. ఇరు దేశాధ్యక్షులు చైనా రాజధాని బీజింగ్ లో కలసుకున్నారు. రష్యా -చిరకాల మిత్రుడని చైనా మీడియా తెలిపింది. పుతిన్ రెండు రోజుల పర్యటన కోసం బీజింగ్ చేరుకున్నారు. ఈ ఇద్దరు నాయకులు ఉక్రెయిన్, ఆసియా స్థితిగతులపై చర్చించారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం పై చర్చించారు.
సాంకేతికత, అణు, భారీ సైనిక శక్తితో అమెరికాతో పోటీపడుతూ దాని ఆధిపత్యానికి చైనా సవాలు విసురుతోంది. ప్రపంచ శాంతి కోసం న్యాయం నిలబెట్టేందుకు సిద్దంగా ఉన్నామని జిన్ పింగ్ తెలిపారు. ఇరు దేశాల మధ్య హద్దుల్లేని భాగస్వామ్యం ఉందని 2022లోనే రష్యా- చైనా ప్రకటించాయి. వేలకొద్ది ట్రూపులను ఉక్రెయిన్ కి పంపిన రెండు రోజుల్లోనే పుతిన్ చైనా చేరుకున్నారు. మే నెలలో మరో సారి అధ్యక్షుడిగా పదవీ ప్రమాణం చేయగానే తన మిత్ర దేశమైన చైనాకు వచ్చి, తన ప్రాధాన్యతలు, వ్యక్తిగత సంబంధాలను జిన్ పిన్ తో బలపరచుకుంటానికి పుతిన్ వచ్చారు. రెండు దేశాల సహకారంతోనే ఈ ప్రాంతంలో స్థిరత్వం ఏర్పడుతుందన్నారు. రెండు దేశాల మధ్య అవకాశ వాదానికి తావులేదని రష్యా పత్రికలు ఉటంకించాయి. అణు విద్యుత్ నుంచి ఆహార సరఫరా వరకు ఇరు దేశాల మధ్య అనేక అంగీకారం ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇదే సమయంలో రష్యాలో చైనా కార్ల పరిశ్రమను నెలకొల్పనుంది.
ఉక్రెయిన్ సంక్షోభం నుంచి బయటపడేలా చైనా ప్రయత్నించడంపై పుతిన్ కృతజ్ఞతలు తెలిపారు. రష్యా సైన్యం ఇప్పటికే ఉక్రెయిన్ లోని అనేక కీలక ప్రాంతాలను ఆక్రమించుకుంది. రెండు దేశాల భాగస్వామ్యంతో తమ దేశాల అభివృద్ది కోసం పరస్పర నమ్మకంతో ముందుకు సాగుతామన్నారు. ఇరు దేశాల మధ్య అంతకు ముందెన్నడూ లేని అపూర్వమైన, అత్యున్నత వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని పుతిన్ అన్నారు. దేశాధినేతలు, పుతిన్ కొత్తగా నియమించిన రక్షణ మంత్రి ఆండ్రీ బెలౌసోవ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సెర్గీలావ్రోవ్, సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ సెర్గీ షోయిగు, ఉషకోవ్ రష్యాలోని శక్తివంతమైన CEOలు ఈ చర్చల్లో పాల్గొన్నారు.
మావో జెడాంగ్ నేతృత్వంలోని1949లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను రష్యా గుర్తించింది. దీంతో రెండు దేశాల నాయకులు వారి 75 ఏళ్ల బంధాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. చైనా, రష్యాలను అతిపెద్ద ప్రత్యర్థిగా అమెరికా భావిస్తోంది. ఈ శతాబ్దంలో ప్రజాస్వామ్యానికి నియంతృత్వాలకు మధ్య పోటీ జరుగుతుందని అమెరిక అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. చైనా తన నిఘా వ్యవస్థలు, సైనిక శక్తి, కంప్యూటింగ్, బయాలజీలో శక్తి చాటుతూ ప్రపంచంపై అమెరిక ఆధిపత్యాన్ని చైనా సవాలు చేస్తోంది.
Discussion about this post