ఐపీఎల్ 2024 సీజన్లో పంజాబ్ కింగ్స్ మరోసారి నిరాశ పరిచింది. ఈ సీజన్లో కూడా ప్లేఆఫ్స్ వరకు వెళ్లలేకపోయింది. ఇంకో మ్యాచ్ చేతిలో ఉన్నప్పటికీ, అందులో గెలిచినా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఈ జట్టుకు సారథ్యాన్ని వహించాల్సిన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం కారణంగా మ్యాచ్‌లు ఆడట్లేదు. అతని స్థానంలో తాత్కాలికంగా సామ్ కుర్రాన్ జట్టు పగ్గాలను చేపట్టినప్పటికీ తలరాత మారలేదు. ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ నుంచి ఓ కొత్త అప్డేట్ వెలువడింది. అతను బుల్లితెరపై అడుగు పెట్టి, ఓ ఛాట్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తోన్నాడు. దీని పేరు ధావన్ కరెంగే. ఈ ఛాట్ షో తొలి ఎపిసోడ్ ఈ నెల 20వ తేదీన జియో సినిమా ప్రీమియంలో టెలికాస్ట్ కానుంది. క్రికెట్ ద్వారా మాత్రమే కాకుండా ఈ ఛాట్ షో ద్వారా అభిమానులతో కనెక్ట్ అయి ఉండాలనే ఉద్దేశంతోనే దీన్ని హోస్ట్ చేయడానికి అంగీకరించినట్లు ధావన్ చెప్పాడు.
వినాయక చతుర్థి | గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
గణేష్ చతుర్థి ఉత్సవాలలోకి లోతుగా మునిగి గణేష్ చతుర్థి, వినాయక చతుర్థి అని కూడా పిలుస్తారు, ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక సమూహాలకు గొప్ప ప్రాముఖ్యత కలిగిన వేడుక....
Discussion about this post