శ్రీరామ నవమి పర్వదినం సందర్బంగా బుధవారం భద్రాచల క్షేత్రం రామాలయంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరగనుంది. రామయ్య కళ్యాణం కోసం భద్రాద్రి అంగరంగ వైభవంగా ముస్తాబైంది. రామాలయంలో మూలవరులకు మొదట కళ్యాణం జరుగుతుంది. ఆలయం నుంచి మంగళ వాయిద్యాలతో మిథిలా కళ్యాణ మండపంకు ఉత్సవ మూర్తులను తీసుకువస్తారు. బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు కళ్యాణ క్రతువు జరుగుతుంది. అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం జరుగుతుంది. 31 వేల మంది భక్తులు కళ్యాణం వీక్షించేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. 1800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
Discussion about this post