స్మితా సబర్వాల్ అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్లెవరూ ఉండరు. కేసీఆర్ సర్కారు హయాంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే.. డైనమిక్ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అటు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే.. మరోవైపు ట్రెండింగ్ టాపిక్లపై స్పందిస్తూ తన అభిప్రాయాలను, తన పర్సనల్ జీవితంలోని విశేషాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. నెటిజన్లతో నిత్యం టచ్లో ఉంటారు. ఫొటోలు, వీడియోలే కాదు.. కొన్ని సార్లు ఇంట్రస్టింగ్ ట్వీట్లు చేస్తూ.. అందరి దృష్టిని ఆకర్షించటమే కాకుండా.. ఆలోచింపజేస్తుంటారు.
Discussion about this post