ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్‌క్‌పలో తలపడే భారత జట్టును జాతీయ సెలెక్టర్లు ప్రకటించారు. 15 మందితో కూడిన ఈ బృందానికి ఊహించినట్టుగానే రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే హార్దిక్ పాండ్యా ఎంపికపై కొంత సందేహాలు వ్యక్తమైనా.. తను బెర్త్ దక్కించుకోవడంతో పాటు జట్టు వైస్ కెప్టెన్సీ కూడా దక్కించుకున్నాడు.
2022 టీ20 వరల్డ్‌కప్ సెమీస్ లో ఓడాక భారత జట్టులో మార్పుల కారణంగా రోహిత్, విరాట్ లేకుండానే ముందుకెళ్లారు. కానీ తిరిగి రోహిత్‌తో పాటు విరాట్ కోహ్లీ సైతం ఈ మెగా టోర్నీలో ఆడబోతుండడం గమనార్హం. ఓపెనర్‌గా యశస్వీ జైస్వాల్, మిడిలార్డర్లో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా రానున్నారు. ఇక జూన్ ఒకటి నుంచి 29 వరకు వెస్టిండీస్, యూఎస్ఏలో ఈ మెగా టోర్నీ జరగనుంది. ఇందుకోసం భారత ఆటగాళ్లు విడతలవారీగా అమెరికా వెళ్లనున్నారు. కోచ్ ద్రవిడ్‌తో కలిసి తొలి బ్యాచ్ మే 21న బయలుదేరుతుంది.
జట్టులో స్టార్ ఆటగాడిగా కొనసాగుతున్న కేఎల్ రాహుల్‌పై ఆశ్చర్యకరంగా సెలెక్టర్లు వేటు వేశారు. ఐపీఎల్లో నిలకడగానే రాణిస్తున్నప్పటికీ అతడికి స్థానం దక్కలేదు. మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్‌ను సైతం విస్మరించారు. ఇక ఫినిషర్ రింకూ సింగ్, ఓపెనర్ గిల్ రిజర్వ్ ప్లేయర్లుగా ఉండగా…. ఇప్పటికే టీ20ల్లో భారత్ తరఫున ఆడిన తిలక్ వర్మ, ముకేశ్ కుమార్‌లకు నిరాశే ఎదురైంది. యువ పేసర్ మయాంక్ యాదవ్‌ను సైతం సెలెక్టర్లు పట్టించుకోలేదు.
వికెట్ కీపర్ రిషభ్ పంత్ సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ జట్టులో ఆడబోతున్నాడు. 2022, డిసెంబరులో కారు ప్రమాదానికి గురైన అతను తాజా ఐపీఎల్లో మెరుగ్గానే రాణిస్తున్నాడు. దీంతో వికెట్ కీపర్‌గా అతడితో పాటు సంజూ శాంసన్‌ను ఎంపిక చేశారు. ఇక, శాంసన్‌కిది తొలి వరల్డ్‌కప్. 2015లోనే జట్టులోకి వచ్చినా ఇప్పటికి 25 మ్యాచ్‌లే ఆడాడు. అలాగే స్పిన్నర్ చాహల్‌పై తిరిగి సెలెక్టర్లు నమ్మకముంచారు. గతేడాది ఆగస్టులో తన చివరి టీ20 మ్యాచ్ ఆడిన చాహల్ తాజా ఐపీఎల్లో ఆడిన 9 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. జడేజా, అక్షర్, కుల్దీప్ ఇతర స్పిన్నర్లుగా ఉన్నారు. అలాగే CSK మిడిలార్డర్ బ్యాటర్ శివమ్ దూబేను సైతం పరిగణనలోకి తీసుకున్నారు. స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగే దూబే మెగా టోర్నీలో ఉపయోగపడగలడని సెలెక్టర్లు భావించడంతో రింకూకు బెర్త్ దక్కలేదు. పేస్ బాధ్యతలను బుమ్రా, అర్ష్‌దీప్, సిరాజ్ తీసుకోనున్నారు.
Discussion about this post