నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని మహబూబ్‌నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్ల పరిధిలోని మాదారం గ్రామంలో ప్రచార రథం పై నుంచి ఆమే మాట్లాడారు. మోసం, లూటి చేస్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు ఓటుతో బుద్ధి చెప్పి బీజేపీకి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. తనను నమ్మి గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని డీకే అరుణ స్పష్టం చేశారు. కేసీఆర్ మీద కోపంతో ఇక్కడ కాంగ్రెస్ మాయమాట్లు నమ్మి ఓటు వేశారని… అందుకే లక్కీ లాటరీలో గెలిచారన్నారు.
Discussion about this post