సీఎం జగన్ పై రాయి వేసింది సతీష్ కుమార్ అనే యువడు అని తేలింది. సీఎం జగన్ పై రాయి దాడి చేసిన యువకుడు సతీష్ కుమార్ అలియాస్ గా సత్తిగా భావిస్తున్నారు పోలీసులు. ఇందులో భాగంగానే ఈ రోజు ఉదయం సతీష్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దాడి చేసిన సమయంలో సతీష్ తో పాటు ఉన్న ఆకాష్, దుర్గా రావు, చిన్నా, సంతోష్ లను కూడా అదుపులోకి తీసుకుంది సిట్. ఫుట్ పాత్ కు వేసే ఎర్రటి టైల్స్ రాయి ముక్కతో దాడి చేసినట్టు పోలీసులు గుర్తించినట్టు సమాచారం అందుతోంది. రాయి ముక్కను జేబులో వేసుకుని వచ్చి సడెన్ గా జగన్ పై సత్తి దాడి చేసినట్టు విచారణలో పోలీసులు గుర్తించినట్టు సమాచారం అందుతోంది.
Discussion about this post