ఐదేళ్లు ప్రజలకు నవరత్నాలు సంక్షేమ పధకాల ద్వారా ఎంతో మేలు జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ సతీష్‌కుమార్ అన్నారు. జగన్ ప్రభుత్వంలో రానున్న ఐదేళ్లు కూడా సంక్షేమ పధకాలు కొనసాగిస్తామని… దీంతో ప్రజలకు మరింత లబ్ధి చేకూరుతుందన్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని మత్స్యకార గ్రామలైన పల్లం, నీలపల్లి గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 2024 లో ముమ్మిడివరం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శివారు మత్స్యకార గ్రామాలకు త్రాగునీటితో పాటు, రోడ్ల సౌకర్యం కల్పిస్తామని అన్నారు.
Discussion about this post