హుజూర్ నగర్ లో బీజేపీ విజయ సంకల్ప సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి నల్గొండ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి హాజరైయ్యారు. ప్రస్తుతం దేశం మొత్తం మోడీ మోడీ అంటోందని శానంపూడి సైదిరెడ్డి చెప్పారు. తనను గెలిపిస్తే నల్గొండను అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ 60 అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. అయోధ్యలో రామాలయం కట్టిన ఘనత మోడీకే దక్కుతుందని తెలిపారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 4 వందల సీట్లు ఖాయమని చెప్పారు.
Discussion about this post