ఎండ బాగా ఉంది.. ద్విచక్రవాహనంలో ఏం వెళ్తాం.. బస్సులో వెళ్దామని నగరవాసులు అనుకుంటే.. ఎండలో మండిపోవాల్సిందే. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ సిటీ బస్సులను తగ్గిస్తున్నామని గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎండలు మండుతున్న వేళ ప్రయాణికులు అంతంతమాత్రమే ఉంటున్నారని.. బస్సులను ఖాళీగా తిప్పలేక ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని టీఎస్ఆర్టీసీ వివరణ ఇచ్చింది. ఎండలు బాగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మధ్యాహ్నం వేళ తప్పనిసరి కాకపోతే బయటకు రావద్దని జీహెచ్ఎంసీ ప్రకటించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా జోడించింది. మరోవైపు మంగళవారం నుంచి ఉదయం 5 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకూ సిటీ బస్సులు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.
Discussion about this post