నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఆదివారం మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. వీరిలో ఏపీ నుంచి ఎంత మంది ఉంటారనేది కీలకంగా మారింది. ఎన్డీయేలో బీజేపీ తర్వాత అత్యధికంగా 16 మంది ఎంపీలతో టీడీపీ రెండో స్థానంలో ఉండగా…బీజేపీ నుంచి ముగ్గురు, జనసేన ఎంపీలు ఉన్నారు. రాష్ట్రానికి రెండు లేదా మూడు కేంద్రమంత్రి పదవులు దక్కవచ్చని భావిస్తున్నారు. శ్రీకాకుళం నుండి మూడో సారి ఎంపీగా విజయం సాధించిన కింజరాపు రామ్మోహన నాయుడు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. రాష్ర మంత్రివర్గంలో జిల్లానుంచి సీనియర్ నేత కింజరాపు అచ్చెన్నాయుడు, కూన రవి కుమార్, బెందాలం అశోక్ ల పేర్లు వినిపిస్తుండగా… విజయనగం జిల్లాకు సంబంధించి కళా వెంకట్రావ్, కొండ్రు మురళీ మోహన్ రేసులో ఉన్నారు.
Discussion about this post