తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. ప్రధాన పార్టీల నుంచి కీలక నాయకులు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కెసీఆర్ బస్సుయాత్ర చేస్తూ ప్రజలను బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని కోరుతున్నారు. ఇక ఇటీవల వరంగల్లో బస్సుయాత్ర నిర్వహించిన కేసీఆర్ కడియం శ్రీహరిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.
కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కడియం శ్రీహరి కౌంటర్ ఇచ్చారు. అవును కచ్చితంగా మూడు నెలల్లో రాష్ట్రంలో అద్భుతం జరగనుందని, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో లేకుండా తుడిచిపెట్టుకుపోతుందని కడియం శ్రీహరి అన్నారు. ముందు నుంచి కేసీఆర్ కు వరంగల్ అంటే వివక్ష ఉందని, అందుకే కేసిఆర్ కుట్రలతో ఆరు ముక్కలు చేశారని చెప్పుకొచ్చారు. లోపల ఎన్నో కుట్రలు పెట్టుకుని బయటకు మాత్రం వేరేలా కనిపిస్తారని, ఆయన నిజస్వరూపం ఎవరికీ తెలియదని కడియం శ్రీహరి అన్నారు.
Discussion about this post