సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు మరో లేఖ రాశారు. బ్యాంకుల నుంచి నోటీసులు, ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న రైతులకు తక్షణం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నాడే 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒకేసారి చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని… బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్ష రూపాయల రుణమాఫీ పొందిన రైతులు కూడా మళ్లీ బ్యాంకులకు వెళ్లి 2 లక్షల రూపాయల రుణాలు తీసుకోవాలని రేవంత్ స్వయంగా పిలుపునిచ్చారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి మాటను నమ్మి తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్నారని… డిసెంబర్ 9 నాడు ప్రకటించినట్టుగా రుణమాఫీ జరగలేదని.. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని ఎప్పట్లోగా చేస్తారో స్పష్టమైన తేది ప్రకటించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
Ratan Tata: The Visionary Behind India’s Transformation
Ratan Tata: జాతీయ చిహ్నానికి నివాళి Ratan Tata, భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త మరియు టాటా గ్రూప్ యొక్క మాజీ చైర్మన్, తన జీవితాన్ని సమాజానికి సేవ...
Discussion about this post