39 సంవత్సరాల తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అటవీ శాఖ భూమికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 106 ఎకరాల భూమి రాష్ట్ర అటవీశాఖదేనని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. భూపాలపల్లి మండలం కొంపెల్లిలోని సర్వే నంబర్ 171 లోని అటవీ శాఖ భూమిపై మహమ్మద్ అబ్దుల్ ఖాసిం అనే వ్యక్తి హక్కును కోరుతూ 1985లో వరంగల్ జిల్లా కోర్టులో కేసు వేశాడు. 1994లో అటవీ శాఖకు అనుకూలంగా తీర్పు వెలువడగా సదరు వ్యక్తి హైకోర్టును ఆశ్రయించగా… సర్వే నెంబర్లలో కొన్ని ఎకరాలు మహమ్మద్ అబ్దుల్ ఖాసింకు చెందుతుందని హైకోర్ట్ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయగా తాజాగా సుప్రీం తీర్పును వెలువరించింది. సర్వే నెంబర్ 171 లోని 106 ఎకరాల మొత్తం భూమి అటవీ శాఖకు చెందుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది.
వినాయక చతుర్థి | గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
గణేష్ చతుర్థి ఉత్సవాలలోకి లోతుగా మునిగి గణేష్ చతుర్థి, వినాయక చతుర్థి అని కూడా పిలుస్తారు, ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక సమూహాలకు గొప్ప ప్రాముఖ్యత కలిగిన వేడుక....
Discussion about this post