ఆల్ ఇండియా క్యారమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో క్యారమ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ, మే 23 నుండి 26 వరకు ఆల్ ఇండియా ఇంటర్-ఇన్‌స్టిట్యూషనల్ క్యారమ్ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించడం ద్వారా గోల్డెన్ జూబ్లీని జరుపుకుంటుంది, అలాగే మే 25న వెటరన్ నేషనల్స్ ఫర్ మెన్ అండ్ వుమెన్ మరియు 26.
పోటీలు నిజామాబాద్‌లోని నవ్యభారతి గ్లోబల్ స్కూల్‌లో జరుగుతాయి. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
ఆటలు మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగపడతాయని తెలంగాణ క్యారం అసోసియేషన్ ప్రెసిడెంట్ సంతోష్ అన్నారు. ఆల్ ఇండియా ఇంటర్ ఇన్స్టిట్యూషనల్ క్యారం ఛాంపియన్షిప్ నిజామాబాదులో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఈ కార్యక్రమానికి జాతీయ, అంతర్జాతీయ ఛాంపియన్స్ వచ్చారన్నారు. క్యారం ప్రతి ఒక్కరు ఆడే ఆట అని.. దీనికి భవిష్యత్తులో మరింత ప్రాధాన్యత పెరుగుతుందని అంటున్న క్యారం అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ సంతోష్.
Discussion about this post