జగనన్న పాలనను మరోసారి తెచ్చుకుందామని మంత్రి, వైఎస్సార్సీపీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఇన్నీసుపేట, స్టేడియం రోడ్డు, సాయికృష్ణ థియేటర్ ప్రాంతాల్లో చెల్లుబోయిన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరినీ పలుకరించి జగన్ ఐదేళ్ల పాలనలో అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంలో మహిళలు వేణుగోపాలకృష్ణ కు మంగళ హారతులు ఇచ్చి ఆయన విజయాన్ని కాంక్షించారు జగనన్న పాలనతో కుటుంబాల్లో మంచి మార్పు వచ్చిందన్నారు. సీఎం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి సాగాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించినవలసిందిగా కోరారు. ఈ ప్రచారం లో మహిళలు కార్య కర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు .
Discussion about this post