గతంలో రాజశేఖర్ రెడ్డి చేసిన విధంగానే ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ రుణామాఫీ చేస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆగస్టులో ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తుందన్నారు. ఇక రైతులు పండించిన పంటను సకాలంలో కొనేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అధికారులు కూడా రైతులకు అందుబాటులో ఉండి పనిచేయాలని మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 19న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి చల్లా వంశీదర్ రెడ్డి నామినేషన్ దాఖలకు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నట్లు మధుసూదన్ రెడ్డి తెలిపారు.
Discussion about this post