తూర్పు గోదావరి జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా నిష్పక్షపాతంగా, సజావుగా, హింసత్మకతకు తావు లేకుండా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధం అవ్వడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత అన్నారు. మార్చి 16వ తేదీన కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యుల్ విడుదల చేసిన సమయం నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి రావడం జరిగిందన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో మే 13న పొలింగ్ డే ను పురస్కరించుకుని పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఏప్రియల్ 18వ తేదీన రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.
Discussion about this post