వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దే పెన్షన్లు అందించేలా చర్యలు తీసుకోవాలని, వాలంటీర్లకు బదులుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు అన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వాలంటీర్ వ్యవస్థను తప్పిస్తూ, ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శిల సేవలను వినియోగించుకుని లబ్దిదారులకు ఇళ్ల వద్దనే అందించాలని కోరారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అవడంతో ఒకటో తారీకు ఇవ్వాల్సిన పెన్షన్లను ఇవ్వలేక పోయిన జగన్ ప్రభుత్వం… ప్రతిపక్షాలపై ఆరోపణలు చేస్తోందని అన్నారు.
Discussion about this post