ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గంలో కోనసీమ ముద్దుబిడ్డ… దివంగత నేత జీఎంసీ బాలయోగి తనయుడు… గంటి హరీష్ మాధుర్ ఎన్నికల ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. కోనసీమ ప్రాంతంలో తన తండ్రిపై ప్రజలు చూపిన ప్రేమ, ఆదరణను తనపైన చూపిస్తున్నారని అన్నారు. తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ…నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పారు. నియోజకవర్గంలోని రామచంద్రపురం, ముమ్మిడివరం, నియోజకవర్గాలలో ప్రచారం ముమ్మరం చేశారు.
Discussion about this post