ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో అర్ధరాత్రి భారీ వర్షపాతం నమోదైంది. పార్లమెంట్ ఎన్నికల రోజు నుంచి వాతావరణం చల్లబడగా.. ప్రతీ రోజూ ఏదో ఒకచోట వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షం కురవడంతో వాగుల ద్వారా నీరు.. ఇటీవల నిర్మించిన చిన్నోనిపల్లి రిజర్వాయర్‌కు చేరుకుంటోంది. పలుచోట్ల కల్లాల్లో ఉన్న ధాన్యం తడవడంతో కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. మొన్నటివరకు 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు పడిపోయాయి. ఈదురు గాలులు, ఉరుములతో వాన పడింది. దాంతో రోడ్ల వెంట, కాలనీల్లో నీళ్లు పారాయి. ఖమ్మం మార్కెట్ యార్డుకు రైతులు తెచ్చిన ధాన్యం తడిసిపోయింది. మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల్లోనూ ధాన్యం తడిసింది. మండుటెండలకు వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. మరో వైపు అన్నదాతలు చేతికి వచ్చిన పంట నష్టం వాటిల్లందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వినాయక చతుర్థి | గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
గణేష్ చతుర్థి ఉత్సవాలలోకి లోతుగా మునిగి గణేష్ చతుర్థి, వినాయక చతుర్థి అని కూడా పిలుస్తారు, ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక సమూహాలకు గొప్ప ప్రాముఖ్యత కలిగిన వేడుక....
Discussion about this post