ఉద్యమాల ఖిల్లా నెల్లూరు జిల్లాలో కోవూరుకు చారిత్రిక ప్రాధాన్యముంది. ఉధ్యమ నేత, పూర్వపు పార్లమెంటు సభ్యులు పుచ్చలపల్లి సుందరయ్య పురిటి గడ్డ అన్నారెడ్డి పాళెం కోవూరు నియోజకవర్గం సొంతం. పొదుపు ఉధ్యమాన లేగుంట పాడు వేదికగా మహిళ ఆర్థిక స్వావలంభన దిశగా అడుగు లేసింది ఇక్కడే . ఈ పరిణామాలతో ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకులు రాజకీయంగా మహిళా సాధికారతకు అవకాశమిస్తూ సామాన్యు రాలైన మునెమ్మను ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టి ఉనికి చాటారు. పేద వర్గానికి చెందిన ఆమె సామర్థ్యం చాలకపోయినా మహిళా సాధికారత అంశానికి అంకురం పడింది.
వేమిరెడ్డి ప్రశాంతమ్మ అన్యూహ్య పరిణామాల నేపథ్యంలో కోవూరు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలబడ్డారు. రాజకీయంగా ఎదుర్కొవాల్సిన ప్రత్యర్థి ఆమె వ్యక్తి గత జీవితాన్ని ప్రస్థావించి బెదరగొట్టి పంపాలనే ప్రయత్నాన్ని , ప్రశాంతమ్మ తనకు తాను గా ఎదురొడ్డి నిలిచారు. నల్లపరెడ్డి రాజేంధ్రరెడ్డి తో జనవరిలో తాను చేసిన ఫోన్ కాల్ సైతం ప్రజాక్షేత్రంలోకి వచ్చింది. ఆ ఫోన్ కాల్ లోనే తమకు తెలుగుదేశం పార్టీ నుంచి రెడ్ కార్పెట్ స్వాగతం ఉందన్న విషయాన్ని వెల్లడించారు. టీడీపీకి చెందిన సోమిరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి సహా కొందరిని ప్రస్తావించి ఎన్నికలలో వీరు నెగ్గే సూచనలు తక్కువని అప్పుడున్న పరిస్థితి పై కాస్తా దూకుడుగా మాట్లాడారు. అయినా అప్పుడన్న పరిస్థితిని అనుసరించి ఎవరు మాట్లాడుకున్నా వాస్తవం అదే అనడంలో అతిశయోక్తి కాదు. జిల్లాలో వైసీపీదే పైచేయిగా ఉన్నా ఆపార్టీలో ఇమడలేక తెలుగుదేశం పార్టీ వైపు పయనించాలని నాడు వేమిరెడ్డి దంపతులు తీసుకున్న నిర్ణయం సాహసోపేతమే.
జిల్లాలో ఉన్న పరిస్థితిని అనుసరించి తెలుగు దేశం పార్టీ అదిష్టానం వీరికి ఏక కాలంలో ఎంపీ , కోవూరు నియోజవకర్గాలలో అభ్యర్థులుగా పోటీచేసే అవకాశమిచ్చింది. అయినా స్థానిక పరిస్థితులను ఆకళింపు చేసుకోవడంతో రాజకీయ అనుభవం లేని వీరు ఇబ్బందులను ఎదుర్కొన్నా, సరైన నిర్ణయాలతో ముందుకు సాగారు. ప్రతి చోటా తమ వారిని పరిశీలకులుగా ఉంచుకొని స్థానికంగా ఉన్నవారికి ఎక్కడా ప్రాధాన్యత లోపించకుండా ప్రశాంతమ్మ చాకచక్యంగా వ్యవహరించారు. ఆయా ప్రాంతాల నాయకులు ఇచ్చే ఫీడ్ బ్యాక్ తోపాటు ఎన్నికల ప్రచారంలో చొరవ చూపారు. తాను స్థానిక మహిళల వద్దకు చొరవగా వెళ్లి మమేకమై సాగడం ప్రశాంతమ్మకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.
కోవూరు కు సుదీర్ఘ కాలం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రత్యేకంగా చేసిన అభివృద్ది ఏందంటూ ప్రశాంతమ్మ సవాలు విసిరారు. తనును వ్యక్తిగతంగా దూషించడం కాదు ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం చేసి ప్రజలకు చేసిన మేలు ఏమిటో ప్రజా క్షేత్రానికి చెప్పాలంటూ నిలదీశారు. జగన్మోహన్ రెడ్ది మొహంచూసి తనకు ఓటేయ మనడం మినహా ప్రజాప్రతినిధిగా ప్రసస్న కుమార్ రెడ్ది సత్తా శూన్యమని పదే పదే విమర్శించారు. ఇందుకు కోవూరు లో కొనసాగిన గ్రావెల్, మట్టి దోపిడీ, ఇసుక అక్రమరవాణా, లే అవుట్ వేసిన వారి వద్ద అడ్డగోలు వసూళ్లతో కోట్ల రూపాయలు గడించ లేదా అంటూ నిలదీశారు. ప్రజలు ఈ విషయంలో ఎమ్మెల్యేను ప్రశ్నించాలంటూ పిలుపునిచ్చారు. కోవూరుకు తలమానికం అయిన చక్కెర కర్మగారాన్ని తెరిపిస్తామని చెప్పి… చెప్పి … రికార్డు అరిగి పోయిందంటూ ప్రశాంతమ్మ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆరు దఫాలు ప్రజాప్రతినిధిగా ప్రాతినిథ్యం వహించినా కనీస అవసరమైన మంచినీటి కొరతను కూడా తీర్చ లేక పోయారంటూ వాగ్ధాటితో రెచ్చి పోయారు. తనకు అవకాశం ఇస్తే తాను చేసి చూపిస్తాను , మహిళా సాధికారత తో రాజకీయం చేసి చూపిస్తానంటూ ఎన్నికలు ముగిసే నాటికి అసలు సిసలైన నాయకత్వ పటిమను అంది పుచ్చుకొని ప్రజాక్షేత్రంలో నమ్మకాన్ని నాటారు.
ప్రారంభంలోనే ప్రశాంతమ్మను బెదరగొట్టేందుకు వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసినా, ఆమె ప్రెస్ మీట్ పెట్టి తన వివరాలను తేటతెల్లం చేసి తిప్పికొట్టారు. కుటుంబ సభ్యుల ప్రచారం తో చెంప చెళ్లు మనిపించారు. ప్రసన్న కుమార్ రెడ్డికి ఆ తరువాత వాయిస్ లేకుండా పోయింది. సుదీర్ఘ రాజీయచరిష్మాకలిగిన ప్రసన్న కుమార్ రెడ్డి మహిళను ఎదుర్కొలేక వ్యక్తి గత నిందారోపణలకు దిగారన్న అపఖ్యాతిని తెచ్చుకున్నారు.. . కోవూరు చక్కెర కర్మాగారంలో ప్రశాంతమ్మ ప్రశ్నకు బదులివ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఎంపీ అభ్యర్థి గా వచ్చిన విజయసాయి రెడ్డి రాజకీయ చాతుర్యంతో ఏదో చేసేస్తాడని, కోవూరు నియోజకవర్గాన్ని మలుపు తిప్తేస్తాడన్న పరిస్థితి కొంతమేరకే పరిమితమైంది. ఆయన జిల్లా వారైనప్పటికీ స్థానికంగా ప్రాబల్యం అసలేలేదు. వైసీపీలో రెండో స్థానాన్ని సాధించినా నెల్లూరు రాజకీయానికి నూతన వ్యక్తి కావడంతో కోవూరులో విజయసాయి రెడ్డి ప్రాధాన్యం అంతంత మాత్రమే..
సుదీర్ఘ రాజకీయ చరిష్మాతో తాము ఏపార్టీలో ఉంటే ఆపార్టీకి కోవూరులో అగ్రస్థానాన నిలబెట్టిన నల్లపరెడ్డి వంశానికి చెందిన ప్రసన్న కుమార్ రెడ్డి తనను చూసి కాకుండా జగన్మోహన్ రెడ్డి చూసి ఓటేయ్యాలన్న ప్రచారాన్ని కీలకంగా వినియోగించినప్పుడు ఇక సాయి రెడ్డి ప్రాబల్యం కూడా అంతంత మాత్రమే అయింది. జగన్మోహన్ రెడ్డి ని వదల బొమ్మాళి అంటోన్న షర్మిలమ్మ కూడా కాంగ్రేస్ పార్టీ సభను కోవూరులో పెట్టి … పార్టీలో నెంబర్ ఒన్ , నెంబర్ టూ లను దుమ్మెత్తి పోశారు. సారా ఉధ్యమం పుట్టిన నెల్లూరులో మద్యం ప్యాక్టరీలు పెట్టిన ఘనులంటూ గుర్తుచేశారు. ఆమె కాంగ్రేస్ పార్టీ నుంచి వకాల్తా పుచ్చుకొన్నప్పటికీ , కోవూరులోని మహిళా సాధికారతకు పరోక్షంగా సహకరించినట్లే అయింది. కోవూరులో కాంగ్రేస్ అభ్యర్థి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఉనికి చాటే విధంగా ఖర్చును భరాయించారు .. . ప్రచారంలోనూ ప్రధాన పక్షాలకు తీసిపోని పోటీనిచ్చారు. ముస్లిం, మైనారి టీ, ఇతర వర్గాలలో కొంతవరకు ఈయన సాధించే ఓట్లు వైసీపీకి ఎక్కవ నష్టం కలిగించేవేనన్న విశ్లేషణలు లేక పోలేదు.
మాట మంచిదైతే ఊరు మనదౌతోందన్న యుక్తితో ప్రశాంతమ్మ అయ్యా , అమ్మా, అన్నా , తమ్ముడూ అంటూ మహిళ అయినప్పటికీ నాయకత్వ లౌక్యాన్నిచూపారు. తన భర్త వేమిరెడ్డితో కూడా పనిలేకుండా రాజకీయంగా తాను, పార్టీ అండగా ఉంటుందన్న నమ్మకాన్ని కలిగించారు. ప్రసన్నకుమార్ రెడ్డి మాట కటువును భరిస్తూ విధిలేక వైసీపీలో కొనగుతున్న వారంతా స్వేచ్చను కోరుతూ ప్రశాంతమ్మ నాయకత్వాన్ని ఆమోదించారు. మహిళాసాధికారత కు తాము కూడా పెద్దమనస్సుతో సహకరిస్తామని తరలివచ్చారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రాజకీయాన్ని తక్కువ గా అంచనా వేసేందుకు కూడా లేదు. వేమిరెడ్డి ధన బలం తో హఠాత్ గా నియోజకవర్గంలోకి దూసుకొచ్చినా, వార్ వన్ సైడ్ అనలేక పోయారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఆమేరకు పార్టీ రాజకీయాన్ని పటిష్టం చేశారు. అన్నేళ్లు అవకాశమిచ్చినా ప్రసన్న కుమార్ రెడ్డి ఎక్కడో అక్కడ తప్పటడుగు వేస్తూనే ఉన్నారన్న భావన అభిమానులలోనూ ఉంది. ఈయన కంటే వెనుక వచ్చి రాజకీయాల్లో రాణించిన నాయకులు జూనియర్ లను తెరమీదికి తీసుకొచ్చారు. కోవూరులో ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రం ఇంకా తాను నిలదొక్కుకొనే పనిలోనే ఉన్నారనే విమర్శ లేకపోలేదు.
Discussion about this post