శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. ఉదయం నుంచే టెక్కలి, సంతబొమ్మాళి, నందిగామ మండలాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సంతబొమ్మాళి మండలం మూలపేట దగ్గర నిర్మిస్తున్న పోర్టు పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు. పెద్ద పెద్ద వాహనాలతో రాళ్ళు, కంకర, ఇసుక లోడ్లు వెళ్తుండడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారని, అనేక మంది గాయాల బారిన పడ్డారని… భారీ వాహనాలను ఆపేస్తామని టీడీపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపుమేరకు పోలీసులు స్పందించారు. సంతబొమ్మాళి మండలంతో పాటు మూలపేట, విష్ణుపురం, తదితర గ్రామాల్లోని టీడీపి నాయకులను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు.
Discussion about this post