నెల్లూరు టీడీపీ లోకసభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన వ్యక్తిగత ఇమేజ్ తో ప్రచారంలో దూసుకుపోతున్నారు. నెల్లూరు శాసన సభ నియోజకవర్గంలో నారాయణతో కలిసి నామినేషన్ల ఘట్టానికి ముందే రాత్రి పగలు ప్రజా క్షేత్రాన్ని చుట్టేశారు. ఓట్ల శాతాన్ని గణనీయం గా పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. తన దాతృత్వంతో దశాబ్ధానికి పైబడి చేస్తోన్న అనేక సేవా కార్యక్రమాలు ఇప్పడు ప్రచారాస్త్రాలు గా మారాయి. ఈ పరిస్థితిని అంచనా వేసిన వైసీపీ నేతలు … పార్టీ లో రెండో స్థానంలో ఉన్న విజయసాయి రెడ్డి ని ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దించి వేమిరెడ్డి దూకుడును అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. వైసీపీ అంచనాలను తలకిందులు చేసే వ్యూహంతో వేమిరెడ్డి , పొంగూరు నారాయణ నెల్లూరు నగరం, రూరల్ , కోవూరు నియోజవర్గాలలో గెలుపును సాధించడంతో పాటు ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకునేందుకు తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు. తమ వ్యక్తిగత ఇమేజ్ పనిచేసే ఈ మూడు ప్రాంతాలపై ప్రత్యేకం గా దృష్టి సారించారు. రాజకీయంగా ఎలాంటి లబ్దిని ఆశించకుండా కేంద్ర స్థాయిలో తమకున్న పరిచయాలతో జిల్లాకు వనరులను తీసుకొచ్చే సామర్థ్యం ఉన్న వ్యక్తిగా వేమిరెడ్డి పట్ల ప్రజా క్షేత్రంలో ఓటర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. నెల్లూరు నియోజకవర్గంలో నారాయణతో కలిసి నిర్వహిస్తున్న ప్రచారం డబుల్ ఇంజన్ ప్రయోజనంగా గెలుపు అవకాశాలను పెంచుతోందని పరిశీలకులు భావిస్తున్నారు .
Discussion about this post