కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి.. తెలంగాణ ప్రజలకు చేసింది ఏమీ లేదని ఖమ్మం పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు. గత మన ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధినే వారి అభివృద్ధిగా చెప్పుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నారని విమర్శించారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అపోహలు సృష్టించారని….. ఇప్పుడు అదే కాళేశ్వరం నుంచే నీళ్లు ఇస్తున్నారని ఎద్డేవా చేశారు. మరోసారి ఎంపీగా తనకు అవకాశం ఇవ్వాలని నామా నాగేశ్వరరావు ఖమ్మం ప్రజలను కోరారు.
Discussion about this post