రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. మే నెల మొదటి వారంలోనే రికార్డ్ స్థాయిలో హై టెంపరచర్స్ నమోదవుతున్నాయి. రాష్ట్రంపై తీవ్ర వడగాల్పులు ఉన్నాయని హైదరాబాద్ ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. 10 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుందని, 41 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఐఎండీ వెల్లడించింది. పిల్లలు, వృద్ధులు బయటకి వెళ్ళడానికి జంకుతున్నారు. ఖమ్మం జిల్లాలోని బొగ్గు గనుల నియోజకవర్గ పరిధిలోని మణుగూరు, ఇల్లందు, కొత్తగూడెం, సత్తుపల్లిలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఉక్కపోతతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Discussion about this post