తిరుమలో భక్తుల రద్దీ స్వల్పంగానే ఉంది. శ్రీవారి దర్శనం కోసం 4 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు. ఇక నిన్న ఒక్క రోజే.. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 04 గంటల సమయం పట్టింది.
నిన్న తిరుమల శ్రీవారిని 77వేల 511 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమలలో రేపు శ్రీవారి ఆలయంలో శ్రీరామ నవమి ఆస్థానం ఉండనుంది. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనం పై మలయప్పస్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఎల్లుండి శ్రీవారి ఆలయంలో శ్రీరామపట్టాభిషేకం ఉంటుంది.
Discussion about this post