దక్షిణ అయోధ్యగా పిలిచే భద్రాచలంలో.. సీతారాముల కళ్యాణం కన్నులపండువగా జరిగింది. ముత్యాలు, పగడాలు, పచ్చలహారంతో.. సీతారాములు మెరిసిపోయారు. మిథిలా స్టేడియంలో వేలాదిమంది భక్తుల నడుమ రాములోరి కళ్యాణం వైభవంగా సాగింది. ఈ కళ్యాణ వేడుకల్లో డిప్యూటీ మంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కొండ సురేఖ పాల్గొని..శ్రీరాముడిని దర్శించుకున్నారు.
Discussion about this post