వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికల పోలంగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఉప ఎన్నికలో 52 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం 4,63,839 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వీరి కోసం 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. పట్టభద్రులు బ్యాలెట్ పత్రాలపై తమ ఓటును వినియోగించుకొనున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 50,676 మంది పురుషులు, 33,199 మంది మహిళలు,… భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 22,590 మంది పురుషులు, 17,516 మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు.
Discussion about this post