హైదరాబాద్ ఖాళీ అవుతుంది… జనాలు సొంతూళ్ల బాట పట్టారు. ఈ 13న ఓట్ల పండగ ఉండటంతో సిటీ జనం స్వస్థలాలకు కదిలారు… ఓటు వేయడానికి పెద్ద ఎత్తున వారి వారి ప్రాంతాలకు వెళ్తున్నారు. మే 13న ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరుగుతుండగా, తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరుగుతాయి.. ఈ ఎన్నికల కోసం ప్రజలు ఓటు వేయాడానికి వెళ్తున్నారు.
13న ఓట్లు ఉండటంతో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అంతకుముందు రెండు రోజులు శనివారం, ఆదివారం కావడంతో ముందు నుంచే తమ ఊళ్లకు పయనం అయ్యారు. మామూలు రోజుల్లో అయితే, హైదరాబాద్ నుంచి శుక్ర, శని, ఆదివారాల్లో ఏపీలోని వివిధ ప్రాంతాలకు 2 వేలకు పైగా ప్రైవేటు, ఆర్టీసీ బస్సులన్నీ దాదాపు 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తాయి.
కానీ గత వారం రోజులుగా ప్రతిరోజూ బస్సులు ఫుల్ ఆక్యుపెన్సీతో ఉన్నట్లుగా ట్రావెల్స్ వర్గాలు చెబుతున్నాయి. పోలింగ్ డే దగ్గరలోనే ఉండటంతో రిజర్వేషన్లకు ఫుల్ డిమాండ్ నడుస్తోంది. అటు ఏపీ వైపు వెళ్లే అన్ని రైళ్లలోనూ టికెట్లన్నీ బుక్ అయ్యాయి.. వందల కొద్దీ వెయిటింగ్ లిస్ట్ లు ఉన్నాయి. ఈ రద్దీ కారణంగా ఆర్టీసీ, రైల్వే యాజమాన్యం ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది.
ఏపీలో ఓటు వేయడానికి వెళ్లే ఓటర్ల కోసం టీఎస్ ఆర్టీసీ బస్సులు నడుపుతోంది. ఈ నెల 9 నుంచే ఏపీకి రద్దీ ఉంటుందని అంచనాతో శని, ఆదివారాల్లో ఇంకా మరింత రద్దీ పెరుగుతుందని.. ముందస్తుగానే బస్సులను ఏర్పాటు చేశారు. తెలంగాణలోని గ్రామాలకు వెళ్లాలనుకునే వారు కూడా ఇబ్బందులు లేకుండా స్వస్థలాలకు వెళ్లేలా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.
పోలింగ్ రోజు తెల్లవారుజాము నుంచి తిరిగి వచ్చేందుకు అర్ధరాత్రి వరకు బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. టీఎస్ఆర్టీసీ రోజూ నడిచే 3,450 బస్సులే కాక, మరో వెయ్యికి పైగా బస్సులను అదనంగా నడుపబోతోంది. దాదాపు 200 బస్సుల్లో రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
ఏపీలో ఈనెల 9 నుంచి 12 వరకు రోజూ నడిచే 352 బస్సులకు అదనంగా 500 బస్సులను నడుపుతున్నాతున్నట్లు అధికారులు ప్రకటించారు. అదనపు బస్సుల్లోనూ రిజర్వేషన్ సౌకర్యలు కల్పించారన్నారు. పోలింగ్ సందర్భాన్ని ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. రిజర్వేషన్లకు బాగా డిమాండ్ ఉండడంతో ఒక టిక్కెట్ ధరను ఇష్టారీతిన మూడు నాలుగు రెట్లు పెంచేశారు. రూ.500 టిక్కెట్ రూ.1500 వరకూ ఉంటోంది. విజయవాడ వెళ్లాలంటే రూ.వెయ్యి దాకా టికెట్ ఉంటోందని ప్రయాణికులు వాపోతున్నారు.
Discussion about this post