దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వేడి కొనసాగుతోంది.ఇప్పటికే పలు పార్టీలు తమ ప్రచారాలతో ఫుల్ బిజిగా మారిపోయాయి. కొందరు నేతలు ఇప్పటికే నామినేషన్లను కూడా వేసేశారు. ఇక, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 13న నామినేషన్ వేయనున్నారు. ఆయన మూడోసారి ముచ్చటగా వారణాసి నుంచి ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఆ విశేషాలేమిటో చూద్దాం.
మోడీ 2014 లో 2019..లోకూడా వారణాసి నుంచే పోటీచేసి గెలుపొందారు. 2014 లో మోడీ పోటీ చేసినప్పుడు ఆయన పై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీ వాల్.. కాంగ్రెస్ నుంచి అజయ్ రాయ్ బరిలోకి దిగారు. అప్పట్లో మోడీ 3,71,784 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు. ద్వితీయ స్థానంలో నిలిచిన కేజ్రీ వాల్ కి 2లక్షల 9 వేల ఓట్లు రాగా .. కాంగ్రెస్ పార్టీకి 75 వేల ఓట్లు వచ్చాయి.
ఆతర్వాత 2019 లో మోడీ మరల వారణాసి నుంచే పోటీ చేశారు ..అప్పుడు 4,79,505 ఓట్ల మెజారిటీ వచ్చింది .. 1,95,159 ఓట్లతో సమాజ్వాది పార్టీ రెండో స్థానం లో నిలవగా .. కాంగ్రెస్ మూడో ప్లేస్ కి పరిమితమైంది. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ కి 1,52,548 ఓట్లు వచ్చాయి. ఈయనకు మొదటిసారి కంటే రెండో సారి పోటీ చేసినపుడు ఓట్లు పెరగడం విశేషం. సమాజ్వాది పార్టీ తరపున షాలిని యాదవ్ పోటీ చేశారు. ఆమె ప్రముఖ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి శ్యామ్ లాల్ యాదవ్ కోడలు.. అప్పట్లో ఆ రెండు పార్టీలు మోడీ ని నిలువరించ లేకపోయాయి. మోడీ మెజారిటీ 1,07,721 ఓట్లకు పెరిగింది.
నాడు మోడీ పై పోటీ చేసిన షాలిని యాదవ్ తర్వాత కాలంలో బీజేపీలో చేరారు. మూడో సారి పోటీ చేస్తున్న మోడీ ఈసారి 5 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీ తో మోడీ ని గెలిపించాలని వారణాసి బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.
ఇపుడు ఈ స్థానం నుంచి మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థి గా అజయ్ రాయ్ బరిలోకి దిగుతున్నారు.ఆయన కూడా మూడో సారి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేస్తున్నారు.
Discussion about this post