దేశంలో మత కల్లోలాలు సృష్టించి లబ్ధి పొందాలని బీజేపీ పార్టీ ఆలోచిస్తుందని దేశ యువత ఆలోచించి ఓటు వేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అటు దేశంలో,ఇటు రాష్ట్రం లో కాంగ్రెస్ మాత్రమే సుపరిపాలన చేస్తుందని, గత పాలకులు అప్పుల కుప్పలు చేస్తే వాటిని సరిచేస్తూ పాలన చేస్తున్నమన్నారు. రాబోయే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత… 3 నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు కల్పించామన్నారు.
Discussion about this post