భారతీయ సంతతికి చెందిన కెఫ్టన్ సునీత విలియమ్స్ మరో సారి అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. కెనడీ స్పేస్ సెంటర్ నుంచి బోయింగ్ స్టార్ లైనర్ లో భారతీయ కాలమానం ప్రకారం 2024 మే 7న ఉదయం 8.04 గంటలకు ఆమె ప్రయాణం మొదలవుతుంది. ఒక్కసారి అంతర్జాతీయ స్పేస్ సెంటర్ కు చేరుకోగానే మళ్లీ నా ఇంటికి వెళుతున్న భావన కులుగుతుందని ఆమె అన్నారు. ఆమె విజయ యాత్రలపై ఒక లుక్కేద్దాం..
సునీత అంతరిక్షంలో విజయవంతంగా ప్రయాణించి, తిరిగి వచ్చిన మొట్టమొదటి మహిళా వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు. ఇప్పటికే ఆమె రెండు సార్లు 2006, 2012లో అంతరిక్షంలో ప్రయాణించి 322 రోజులు గడిపారు. 50 గంటల 40 నిముషాలు స్పేస్ వాక్ చేశారు. సునీత విలియం తండ్రి గుజరాత్ లో పుట్టారు. ఆపై చదువుల నిమిత్తం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారుు. ఆమె తల్లి స్లొవేకియా దేశానికి చెందినవారు. సునీత వ్యోమగాములకు సారధ్యం వహిస్తారని నాసా తెలిపింది. 1998లో ఆమె వ్యోమగామిగా ఎన్నికైంది. 2015లో ఆమె పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం ఆమె నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రాంలో పాలు పంచుకుంటున్నారు. ఎలెన్ మస్క్ ఆధ్వర్యంలోని SpaceX ద్వారా ఆమె అంతరిక్షంలోకి వెళుతున్నారు. ఈ సంస్థ 2020 నుంచి అంతరిక్ష కార్యక్రమాలను చేపట్టింది.
గతంలో ఆమె లార్డ్ గణేష్ విగ్రహాన్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. గణేష్ ఇష్టదైవంగా..విజయాన్నిచ్చే దేవుడిగా ఆమె నమ్ముతారు. అలాగే ఆమె భగవద్గీతను కూడా వెంట తీసుకెళ్లారు. బెంగళూరు ఇస్రో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అధిపతి గగన్ యాన్ సైంటిస్టు డా. ఎం మోహన్ మాట్లాడుతూ సునీత విలియం మరో మిషన్ లో అంతరిక్షంలోకి వెళ్లడం మనందరికీ గర్వకారణం అన్నారు. అంతా అనుకున్నట్లు సాగితే.. ఆమె స్పేస్ నుంచి విద్యార్థులతో మాట్లాడతారు. లార్డ్ గణేష్ తనతో ఉన్నంతవరకు తనకంతా మంచే జరుగుతుందని చెప్పే సునీత విలియమ్స్ కు ఆల్ ది బెస్ట్ చెబుదాం..
Discussion about this post